వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువతీ–యువకుడు
జనగామ జిల్లా తిమ్మంపేట మండలం బోళ్లమత్తిడి వద్ద విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో బైక్‌తో సహా ఇద్దరు యువతీ–యువకులు కొట్టుకుపోయారు. స్టేషన్ ఘనపూర్–జాఫర్‌ఘడ్ రహదారిపై ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే — శివకుమార్, శ్రావ్య అనే యువతీ–యువకులు బైక్‌పై వెళ్తుండగా, అకస్మాత్తుగా ఎదురైన వరద ప్రవాహం వారిని కొట్టుకుపోయింది. తీవ్ర సాహసంతో చెట్టు కొమ్మను పట్టుకుని శివకుమార్ బయటపడ్డాడు. అయితే అతనితో ఉన్న శ్రావ్య ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైంది.
సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన శ్రావ్య కోసం తీవ్రంగా శోధిస్తున్నారు. వరద నీటి మోత ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు కష్టతరంగా మారాయి.
స్థానికులు ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు. రహదారి మీద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment