-->

బంద్‌ నేపథ్యంలో ఉద్రిక్తత షాపులు, పెట్రోల్ బంక్‌లపై బీసీ సంఘ నేతల దాడులు

బంద్‌ నేపథ్యంలో ఉద్రిక్తత షాపులు, పెట్రోల్ బంక్‌లపై బీసీ సంఘ నేతల దాడులు


హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్‌ ప్రభావం బలంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నప్పటికీ, రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని నల్లకుంట ప్రాంతంలో బంద్‌ తీవ్ర రూపం దాల్చింది. బంద్‌ను పట్టించుకోకుండా తెరిచి ఉన్న బజాజ్‌ షోరూం, రాఘవేంద్ర టిఫిన్‌ సెంటర్‌లపై బీసీ సంఘాలకు చెందిన ఆందోళనకారులు దాడి చేశారు. షోరూం అద్దాలపై సిమెంట్‌ బ్లాక్స్ విసరడంతో అవి చెల్లాచెదురుగా పడ్డాయి. అనంతరం సమీపంలోని పెట్రోల్‌ బంక్‌పై కూడా దాడి జరిపి, ఫ్యూయల్‌ మెషిన్లను ధ్వంసం చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే లోకల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేశారు. బంద్‌ నేపథ్యంలో పోలీసు బందోబస్తు మరింత కఠినతరం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793