వివాహమైన రెండువారాలు గడవకముందే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి
అక్టోబర్ 30, 2025 నల్గొండ జిల్లా: వివాహమైన రెండువారాలు కూడా గడవకముందే ఓ కొత్త వధువు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్, దామెర గ్రామానికి చెందిన అనూష (22) ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.
బుధవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, గుర్రంపోడు సమీపంలో మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఢీ కొట్టిన వేళ అనూష వంతెనపై నుంచి వాగులో పడిపోగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నవీన్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఈ దుర్ఘటనతో రెండు గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతులపై ఇంత దారుణం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 🚨

Post a Comment