-->

ప్రభుత్వ చేయూత అందని దివ్యాంగుడి దీనగాథ...

 

మెదక్ జిల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందులో భాగమైన చేయూత(ఆసరా పెన్షన్ల)అందక దీని స్థితిలో జీవనం కొనసాగిస్తున్నాడో. దివ్యాంగుడు.వివరాల్లోకి వెళ్తే శ్రీనివాస్ ప్రేమలత దంపతులు ఉపాధి నిమిత్తం సుమారు 22 సంవత్సరాల క్రితం తూప్రాన్ మండల కేంద్రానికి వలస వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి దివ్యాంగుడైన దీపక్ చారి(12సం.) రితిక (6సం.) సంతానం. వీరిలో దీపక్ పుట్టుకతోనే దివ్యాంగుడు. ఐతే దివ్యాంగుడైన దీపక్ చారి ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల తూప్రాన్ లో 9వ తరగతి చదువుతున్నాడు. దీపక్ కొరకు తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగమైన చేయూత (ఆసరా పెన్షను) పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. చేయూత పెన్షన్ అందాలంటే జిల్లా వైద్యాధికారి ధృవీకరించిన సదేరం సర్టిఫికెట్ కావాలని సదరు మండల పరిషత్ అధికారులు సూచించారు. 2014 సంవత్సరంలో మెదక్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ప్రకటన అనుసరించి మీసేవ కేంద్రంలో స్లాటు బుక్ చేశారు. అనంతరం దీపక్ చారిని తల్లిదండ్రులు మెదక్ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆసుపత్రిలో మెడికల్ క్యాంపుకు తీసుకెళ్లగా అక్కడ వైద్యులు దీపక్ ను పరీక్షించి సదేరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని సదరు గ్రామీణాభివృద్ధి శాఖ కు సూచించారు. కానీ పది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అతనికి సదేరం సర్టిఫికెట్ మంజూరు కాలేదు.ఆ తరువాత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సదేరం క్యాంపు కొరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. సదరు దివ్యాంగుడైన దీపక్ మళ్లీ మీసేవ కేంద్రంలో స్లాటు బుక్ చేయడానికి ప్రయత్నం చేయగా దరఖాస్తు తిరస్కరణకు గురైందని స్లాటు బుక్ కావడం లేదని మీసేవ కేంద్రం నిర్వాహకులు ఒక రిసిప్ట్ ఇచ్చారని తిరస్కరించిన మీసేవ రిసిప్ట్ ను తీసుకుని వైద్యారోగ్య శాఖ అధికారులను కలిస్తే సదరు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో సంప్రదించాలనీ..... గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను అడిగితే హైదరాబాద్ లో గాంధీ లేదా ఉస్మానియా ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యాంపుకు తీసుకెళ్లాలని చెబుతున్నారని ఎటు వెళ్ళాలో తెలీక అయోమయ స్థితిలో ఉన్నామని దీపక్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద దివ్యాంగ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటామని ఎన్నికల సమయంలో స్థానిక రాజకీయ నాయకులు హామీ ఇచ్చారని తరువాత పట్టించుకోవడం లేదని పుట్టుకతోనే దివ్యాంగుడైన తమ కుమారుడు దీపక్ దీన పరిస్థితిని చూసి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సదేరం సర్టిఫికెట్ మంజూరు చేయించాలని తద్వారా చేయూత (ఆసరా పెన్షన్) పథకం కింద లబ్ధి చేకూర్చాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను అందించాలని తల్లిదండ్రులు ప్రేమలత శ్రీనివాస్ లు మీడియా ద్వారా కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793