బీసీ రాష్ట్ర బంద్ కార్యక్రమంలో దిశా ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం జరుగుతున్న బీసీ రాష్ట్ర బంద్ కార్యక్రమంలో దిశా ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ వర్గాల నాయకులు, విద్యార్థులు, మహిళా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మరియు బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బంద్ పిలుపు ఇవ్వగా, దిశా ఉమెన్ సంస్థ కూడా తమ మద్దతు ప్రకటించింది.
వాసర్ల నాగమణి గారు, దిశా కుటుంబ సభ్యులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కలుసుకుని, వారి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని ఆమె డిమాండ్ చేశారు.
తదుపరి, ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, షాపులను బంద్ చేయమని విజ్ఞప్తి చేయగా, వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు “బీసీ హక్కు – మన హక్కు” అంటూ నినాదాలు చేశారు.
దిశా ఉమెన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, బీసీ సమాజ అభ్యున్నతి కోసం దిశా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ ఉద్యమం సమాన హక్కుల సాధనకు దారితీస్తుందని పేర్కొన్నారు.
Post a Comment