-->

పేదింటి బిడ్డలను చదువులకు దూరం చేస్తోన్న రేవంత్ ప్రభుత్వం

పేదింటి బిడ్డలను చదువులకు దూరం చేస్తోన్న రేవంత్ ప్రభుత్వం

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బాకీలు – ప్రైవేట్ స్కూళ్లలో వేలాది విద్యార్థులు ఇబ్బందుల్లో

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “బెస్ట్ అవైలబుల్ స్కీమ్” కింద ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు విద్యకు దూరమవుతున్నారు.

కల్వకుంట్ల కవిత విమర్శిస్తూ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఈ స్కీమ్ కింద ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. పేదల పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టింది” అని మండిపడ్డారు.

నల్గొండ, జగిత్యాల వంటి జిల్లా కేంద్రాల్లో అనేక ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోవడంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దసరా సెలవుల తర్వాత క్లాసులకు వచ్చిన విద్యార్థులను యాజమాన్యం గేట్ల వద్దే ఆపేసి, “ఫీజులు చెల్లిస్తే కానీ లోపలికి రానివ్వం” అని తేల్చి చెప్పింది.

ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో స్కూళ్లను నడపడం కష్టమైపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తల్లిదండ్రులే భారం మోయాలని యాజమాన్యం స్పష్టం చేసింది.

తమ గోడు చెప్పుకునేందుకు జగిత్యాల కలెక్టరేట్‌కు వెళ్లిన విద్యార్థులు, తల్లిదండ్రులు అక్కడ కూడా నిరాశతో తిరిగి వచ్చారు. కలెక్టరేట్ సిబ్బంది, “డిప్యూటీ సీఎంను కలిసి ఫీజుల కోసం విన్నవించుకోండి” అంటూ సలహా ఇచ్చారు.

ఇక ప్రజలు ప్రశ్నిస్తున్నారు –

“ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఇదేనా ప్రజా పాలన అంటే?”


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793