హైదరాబాద్: ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌లోని గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కందుకూరు మండలం, ఆకుల మైలారం గ్రామానికి చెందిన గండికోట యాదయ్య (55) రాళ్లు కొట్టి విక్రయించి జీవనం సాగించేవాడు.
శుక్రవారం పనుల కోసం సైకిల్‌పై ప్రయాణిస్తుండగా, గ్రామంలోని కల్వర్టు దగ్గర ఒక టిప్పర్ లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య సైకిల్‌తో పాటు కింద పడగా, టిప్పర్ టైర్లు ఆయన కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment