-->

సింగరేణి కొత్తగూడెం ఏరియా సమస్యలు వెంటనే పరిష్కరించాలి : హెచ్‌ఎంఎస్‌

సింగరేణి కొత్తగూడెం ఏరియా సమస్యలు వెంటనే పరిష్కరించాలి : హెచ్‌ఎంఎస్‌


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి : నవంబర్ 7: కొత్తగూడెం ఏరియాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏరియా జిఎం గారిని కలిసి మెమోరాండం అందజేశారు.

సమావేశంలో మాట్లాడిన హెచ్‌ఎంఎస్‌ నాయకులు, ఏరియాలో పనిచేస్తున్న జనరల్‌ అసిస్టెంట్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సర్ఫేస్‌ కౌన్సిలింగ్‌ను వెంటనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏరియాలో గల సర్ఫేస్‌ ఖాళీలను సీనియార్టీ ప్రాతిపదికన స్థానిక కార్మికులతోనే నింపాలని డిమాండ్‌ చేశారు. అలాగే, మెడికల్‌ అన్ఫిట్‌ అయిన వారసుల పోస్టింగ్‌లు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే తొలగించి నియామకాలు చేయాలని కోరారు.

ఇటీవల వస్తున్న సత్తుపల్లి సమంత ఓ & ఎం ప్రైవేటీకరణ వార్తలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రైవేట్‌ కార్మికుల ద్వారా కాకుండా పర్మినెంట్‌ వర్కర్లతోనే సిఎస్పి నడపాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రుద్రంపూర్‌ ఆర్‌సిహెచ్‌పీలో ఖాళీలను స్థానిక జనరల్‌ అసిస్టెంట్‌లకు ప్రమోషన్‌ రూపంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై జిఎం సానుకూలంగా స్పందిస్తూ, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ నాయకులు ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ ఆంజనేయులు, బ్రాంచ్‌ సెక్రటరీ ఆసిఫ్, కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్, బ్రాంచ్‌ చీఫ్‌ అడ్వైజర్‌ గోపి, సత్తుపల్లి సమంత పిట్‌ సెక్రటరీ కాకా నరసింహారావు, కిష్టారం ఫిట్‌ సెక్రటరీ మోగిని, ఏరియా వర్క్‌షాప్‌ పిట్‌ సెక్రటరీ కరీం, రుద్రంపూర్‌ ఆర్‌సిహెచ్‌పి ఫిట్‌ సెక్రటరీ పూర్ణచంద్రరావు (సొసైటీ డైరెక్టర్), పివికే ఫై అసిస్టెంట్‌ పిట్‌ సెక్రటరీ నవీన్, హెచ్‌ఎంఎస్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శివ, కన్వీనర్‌ శ్రీనివాస్, బ్రాంచ్‌ కోఆర్డినేటర్‌ అజీమ్, వికేఓసి నాయకులు ఫాహీమ్, కన్వీనర్‌ సాయి సందీప్, ఆర్గనైజర్‌ మోహన్‌రావు, వర్క్‌షాప్‌ నాయకులు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793