బీబీపేట్ లో సామూహిక వందేమాతరం ఆలాపన
బీబీపేట్, నవంబర్ 07 : వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం ఘనంగా సామూహిక వందేమాతరం ఆలాపన జరిగింది. మండల ప్రజలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ మాట్లాడుతూ – వందేమాతరం జాతీయ గీతం భారతీయులలో దేశభక్తిని నింపిన ప్రేరణా గీతం అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఈ గీతం ప్రేరణనిచ్చిందని, ప్రతి భారతీయుడు గౌరవంతో ఆలపించాల్సిన గీతమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 🇮🇳

Post a Comment