-->

గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని.. 9వ తరగతి విద్యార్థిపై కేసు

గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని.. 9వ తరగతి విద్యార్థిపై కేసు


జడ్చర్ల: జడ్చర్ల మండల పరిధిలో గర్భం దాల్చిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఘటన కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థితో పరస్పర ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ సహజీవనం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే యువతి గర్భవతి అయినట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనలో యువతి, యువకుడు ఇద్దరూ మైనర్లే కావడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కేసుకు సంబంధించి ఇద్దరు మైనర్లను జువెనైల్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793