-->

కన్నకూతురిపై లైంగిక దాడి, తండ్రి–మొదటి భార్య పోలీసుల కస్టడీలో

కన్నకూతురిపై లైంగిక దాడి, తండ్రి–మొదటి భార్య పోలీసుల కస్టడీలో


గద్వాల జిల్లా కేంద్రం: గద్వాల జిల్లాలో మానవత్వాన్ని దిగజార్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి తన 16 ఏళ్ల కన్నకూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సదరు వ్యక్తికి మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం కుటుంబ సంబంధాల ద్వారా రెండో వివాహం జరిపించుకున్నాడు. రెండో భార్యకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో, రెండో భార్యకు చెందిన బాలికపై తండ్రి పలు మార్లు లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది. దాంతో బాలిక గర్భవతిగా మారినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు, నిందితుడి మొదటి భార్య బాలికకు గర్భస్రావం చేయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బాధిత బాలిక ఈ దారుణాన్ని స్థానికంగా ఉన్న మరో మహిళకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.

పోలీసులు తండ్రి మరియు అతని మొదటి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోక్సో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793