-->

అన్నదమ్ముల జంట హత్యలు కలకలం వ్యక్తిగతమా..? రాజకీయమా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

అన్నదమ్ముల జంట హత్యలు కలకలం వ్యక్తిగతమా..? రాజకీయమా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు


పల్నాడు జిల్లా, దుర్గి మండలం – అడిగొప్పల గ్రామం పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన అన్నదమ్ముల జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. గ్రామానికి చెందిన శ్రీరామమూర్తి, కొత్త హనుమంతరావు అనే సోదరులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ద్వంద్వ హత్యల వెనుక వ్యక్తిగత కక్షలేనా, రాజకీయ విభేదాలేనా, లేక గ్రామంలో గ్రూపుల ఆధిపత్య పోరాటమేనా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

అలాగే, గత కొన్ని నెలలుగా గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, వ్యక్తుల మధ్య విభేదాలు, రాజకీయ నేపథ్యం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కీలక సమాచారం సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనతో అడిగొప్పల గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793