పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్, డిసెంబర్ 13: పెళ్లైన మూడు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసాపేటలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందన జ్యోతి అనే యువతికి యశ్వంత్‌తో మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment