-->

హైదరాబాద్ చేరుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ

హైదరాబాద్ చేరుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌కి భారీ ఏర్పాట్లు


హైదరాబాద్ | డిసెంబర్ 13: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన మెస్సీ, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. మెస్సీ బస చేస్తున్న ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

మెస్సీ పర్యటనలో భాగంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించగా, 100 మందికి ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. ఇందుకోసం ఎంపికైన వారికి క్యూఆర్ కోడ్‌లు జారీ చేశారు.

ఉప్పల్ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత

కోల్‌కతాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సుమారు 3,000 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మ్యాచ్ టికెట్ ఉన్నవారికే స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నారు.

వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రత్యేక ప్రదేశాలను సిద్ధం చేశారు. స్టేడియం మరియు పరిసర ప్రాంతాలను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

డీజీపీ పరిశీలన

ఉప్పల్ స్టేడియంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

మ్యాచ్ షెడ్యూల్

  • రాత్రి 7:50 – ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం
  • రాత్రి 8:05 – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియానికి రాక
  • రాత్రి 8:06 – మెస్సీ మైదానంలోకి ప్రవేశం
  • రాత్రి 8:08 – రోడ్రిగో, లూయిస్ సువారెజ్ ఎంట్రీ
  • రాత్రి 8:13 – పెనాల్టీ షూటౌట్
  • రాత్రి 8:18 – రాహుల్ గాంధీ మైదానంలోకి ప్రవేశం

మెస్సీ హైదరాబాద్ పర్యటనతో నగరమంతా ఫుట్‌బాల్ సందడి నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793