-->

గట్టుబూత్కూర్‌లో టిడిపి సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం

గట్టుబూత్కూర్‌లో టిడిపి సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం స్థానిక రాజకీయాల్లో టీడీపీకి కొత్త ఊపిరి


తెలంగాణ ఏర్పాటుకు తర్వాత గ్రామీణ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో వరుస ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకు అవకాశాలు దాదాపు లేకుండాపోయాయి. అయితే ఈసారి గంగాధర మండలంలో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో ఆ రాజకీయ సమీకరణాలకు భిన్నంగా ఆశ్చర్యకర ఫలితం నమోదైంది.

గట్టుబూత్కూర్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన టిడిపి అభ్యర్థి మల్కాపురం రాజేశ్వరి బలమైన ప్రత్యర్థులను ఓడించి ఘన విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలహీన దశలో ఉన్న తరుణంలో ఈ విజయాన్ని గ్రామస్థులు సెన్సేషన్ గా భావిస్తున్నారు.

రాజేశ్వరి విజయానికి గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై పనిచేయడం, అభివృద్ధిపై స్పష్టమైన హామీలు ఇవ్వడం, కుటుంబ సభ్యుల మద్దతు, ప్రజల్లో కలిగిన విశ్వాసం ప్రధాన కారణాలని పార్టీ నాయకులు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగల నాయకత్వం అవసరమన్న భావనతో రాజేశ్వరికే ఓటు వేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో భారీ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్నా, గ్రామ స్థాయిలో టీడీపీకి వచ్చిన ఈ అపూర్వ విజయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. గట్టుబూత్కూర్ ఫలితం టిడిపికి మరోసారి గ్రామీణ రాజకీయాల్లో నిలదొక్కుకునే అవకాశం కలిగించిందని నాయకులు భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793