-->

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిందన్న ప్రచారం తప్పుడు: మంత్రి కొండా సురేఖ స్పష్టం

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిందన్న ప్రచారం తప్పుడు: మంత్రి కొండా సురేఖ స్పష్టం


హైదరాబాద్‌: తనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిందని కొన్ని మీడియాలో వచ్చిన కథనాలను మంత్రి కొండా సురేఖ ఖండించారు. తాను కోర్టులో హాజరయ్యానని, విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఎలాంటి వారెంట్‌లు జారీ కాలేదని స్పష్టం చేశారు.

గతేడాది అక్టోబర్‌లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో ఈ కేసు కొనసాగుతోంది. ప్రాథమిక ఆధారాలను పరీక్షించిన నాంపల్లి కోర్టు, కేసు కొనసాగించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.

అదే విధంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌ 356, అలాగే సెక్షన్‌ 222, 223 ప్రకారం కేసు కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కూడా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Blogger ఆధారితం.