చేతబడి అనుమానంతో వ్యక్తి దారుణ హత్య అటవీ ప్రాంతంలో హత్య చేసి మృతదేహం దహనం
నిర్మల్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కడెం మండలంలో చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఉడుంపూర్ పంచాయతీ గండి గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య (55)ను అదే గ్రామానికి చెందిన మూతి నరేశ్ (21), అతని అన్న మల్లేశ్ (23) ఈ నెల 10వ తేదీ రాత్రి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం, భీమయ్య మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో నిందితులు అతడిని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని కాల్చి బూడిద చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు విచారణలో నేరాన్ని ఒప్పుకున్నారని అధికారులు వెల్లడించారు. గ్రామాల్లో అంధవిశ్వాసాల వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment