ఇంట్లో పేలిన ఏసీ.. కవలలు మృతి బర్కత్పురలో విషాద ఘటన
హైదరాబాద్ బర్కత్పురలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న ఎయిర్‌కండిషనర్ (AC) పేలిపోవడంతో మూడేళ్ల కవలలు ప్రాణాలు కోల్పోయారు.
నిన్న సాయంత్రం బర్కత్పురకు చెందిన రహీం ఖాద్రి, రెహ్మాన్ ఖాద్రి అనే కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా AC కంప్రెషర్ పేలింది. వెంటనే మంటలు చెలరేగి, గదంతా పొగ కమ్ముకోవడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం.
ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే AC పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన నేపథ్యంలో నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. నాణ్యమైన స్టెబిలైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలి, అలాగే ఎయిర్‌కండిషనర్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడం అత్యంత అవసరం అని హెచ్చరిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 🕯️

Post a Comment