-->

ఉప్పల్ స్టేడియంలో భద్రతపై హై అలర్ట్ డీజీపీ శివధర్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ

ఉప్పల్ స్టేడియంలో భద్రతపై హై అలర్ట్ డీజీపీ శివధర్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ


హైదరాబాద్, డిసెంబర్ 13: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ముఖ్య కార్యక్రమాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. స్టేడియానికి చేరుకున్న డీజీపీ, అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, భద్రతా సిబ్బందితో సమావేశమై కీలక సూచనలు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా జనసమూహ నియంత్రణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా కోల్‌కతాలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను స్క్రీనింగ్ చేసి సిబ్బందికి చూపించారు. ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని భద్రతా లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సుమారు 3 వేల మంది పోలీసులు మోహరించినట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు వంటి చర్యలతో భద్రతను మరింత బలోపేతం చేశారు.

ప్రేక్షకుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793