స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు మెదక్ జిల్లాలో పారిశ్రామిక ప్రమాదం ఒకరి మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామ పరిధిలోని ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఘటన సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే పేలుడుకు గల కారణాలపై కూడా విచారణ కొనసాగుతోంది.

Post a Comment