-->

చైనా మాంజా బారిన మరో యువకుడు – గొంతు కోసుకుపోయి తీవ్ర గాయాలు

చైనా మాంజా బారిన మరో యువకుడు – గొంతు కోసుకుపోయి తీవ్ర గాయాలు


హైదరాబాద్, శంషీర్‌గంజ్: నగరంలో చైనా మాంజా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శంషీర్‌గంజ్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న యువకుడికి చైనా మాంజా మెడకు తగలడంతో గొంతు తీవ్రంగా కోసుకుపోయిన ఘటన కలకలం రేపింది.

నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన జమీల్ అనే యువకుడు శుక్రవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, అకస్మాత్తుగా చైనా మాంజా అతని మెడకు చుట్టుకుంది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి, రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రాథమిక సహాయం అందించి, జమీల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు జమీల్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గొంతు భాగంలో లోతైన గాయాలు కావడంతో ప్రత్యేక చికిత్స అవసరమని పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో చైనా మాంజా కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు యువకులు, పిల్లలు తీవ్రంగా గాయపడగా, కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవించింది. నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా విక్రయాలు, వినియోగం కొనసాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793