-->

ఈ నెల 30లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు సమర్పించాలి: ఎంపీడీవో యాదగిరి

ఈ నెల 30లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు సమర్పించాలి: ఎంపీడీవో యాదగిరి లేదంటే కఠిన చర్యలు తప్పవు


పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ నెల 30లోగా తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను తప్పనిసరిగా సమర్పించాలని ఎంపీడీవో యాదగిరి హెచ్చరించారు.

సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్‌గా పోటీ చేసిన గెలిచినవారితో పాటు ఓడిపోయిన అభ్యర్థులు కూడా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను మండల పరిషత్ కార్యాలయంలో నిర్ణీత గడువులోగా అందజేయాలన్నారు.

నిర్దేశిత గడువులో ఎన్నికల ఖర్చుల లెక్కలు సమర్పించని అభ్యర్థులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎంపీడీవో స్పష్టం చేశారు. ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే గెలిచిన అభ్యర్థుల సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అందువల్ల ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఈ నెల 30లోగా ఖర్చుల లెక్కలను సమర్పించి చట్టపరమైన సమస్యలను తప్పించుకోవాలని ఆయన సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793