-->

రావినూతలలో సోలార్ మోడల్ విలేజ్ ప్రారంభం

ప్రజలను విద్యుత్ వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు


మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్. ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న విప్లవాత్మక ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలోనే కాక ప్రపంచస్థాయిలో ఆదర్శంగా నిలిచేలా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని గ్రామ స్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 81 గ్రామాల్లో రూ.1,380 కోట్ల వ్యయంతో ఈ సోలార్ మోడల్ విలేజ్ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా కుటుంబాలకు అదనపు ఆదాయం లభించడంతో పాటు రైతులకు మరింత లాభం చేకూరనుంది. అలాగే రాష్ట్రానికి స్వచ్ఛమైన పునరుత్పాదక శక్తి అందుబాటులోకి రానుంది.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలను కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793