-->

44వ డివిజన్ నుంచి కాంగ్రెస్ బీ-ఫారం కేటాయించాలి: కేసుపాక వెంకటేశ్వర్లు / కేసుపాక లక్ష్మి

44వ డివిజన్ నుంచి కాంగ్రెస్ బీ-ఫారం కేటాయించాలి: కేసుపాక వెంకటేశ్వర్లు / కేసుపాక లక్ష్మి


పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్‌కు రానున్న ఎన్నికల నేపథ్యంలో 44వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బీ-ఫారం కేటాయించాలని కోరుతూ పార్టీ నాయకత్వానికి వినతి సమర్పించారు.

సుజాతానగర్ పరిధిలోని 44వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసుపాక వెంకటేశ్వర్లుకి లేదా కేసుపాక లక్ష్మికి బీ-ఫారం కేటాయిస్తే ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కేసుపాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “పార్టీపై నిబద్ధతతో పనిచేస్తూ సీఎం  ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరావు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేశాం. 44వ డివిజన్ నుంచి బీ-ఫారం కేటాయిస్తే తప్పకుండా గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ప్రజలకు సేవ చేస్తాను” అని తెలిపారు.

ఈ రోజు పాల్వంచలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఎన్నికల ఇన్‌చార్జి తాళ్లూరు బ్రహ్మయ్య గారి సమక్షంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎం మాజీ చైర్మన్ కొత్త వాళ్ల శ్రీనివాసరావు, పెద్దమ్మతల్లి మాజీ చైర్మన్ మైపత్తి రామలింగం, పెద్దమ్మతల్లి మాజీ డైరెక్టర్ ఎస్‌వీఆర్ చారి తదితరుల ఆశీస్సులు అందుకున్నట్లు తెలిపారు.

44వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, సరైన అభ్యర్థికి అవకాశం ఇస్తే విజయం ఖాయమని స్థానిక పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793