-->

బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. నలుగురికి గాయాలు

బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. నలుగురికి గాయాలు


హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి ఫ్లైఓవర్‌పై బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన వాహనాన్ని ఫ్లైఓవర్‌పై నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793