-->

ఇంటర్ పరీక్షలు: ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి

ఇంటర్ పరీక్షలు: ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి


హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరటనిచ్చింది. పరీక్ష ప్రారంభ సమయం నుంచి గరిష్టంగా ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

గతేడాది అమలు చేసిన ఈ నిబంధనను ఈ విద్యా సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజులు చెల్లించారు.

ఇదిలా ఉండగా,

  • రేపు, ఎల్లుండి ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు,
  • జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్,
  • జనవరి 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

అలాగే, ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇతర ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793