-->

ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించొద్దు

మెడికల్ షాపులకు డ్రగ్స్ కంట్రోల్ శాఖ కఠిన హెచ్చరిక


హైదరాబాద్: ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించడంపై డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తోంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని స్పష్టం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా యాంటీబయాటిక్స్ విక్రయించిన 190 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగించడం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో మందులు పనిచేయని స్థాయికి తీసుకెళ్లి, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని తెలిపారు.

అందువల్ల, మెడికల్ షాప్ యజమానులు తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే యాంటీబయాటిక్స్ విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు.

ప్రజలు కూడా స్వచ్ఛందంగా మందులు వాడకుండా, వైద్యుల సలహా మేరకే యాంటీబయాటిక్స్ తీసుకోవాలని సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793