-->

నేటి నుంచి మేడారం మహాజాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం

నేటి నుంచి మేడారం మహాజాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం


హైదరాబాద్ / మేడారం | జనవరి 22, 2026: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.

జాతరను విహంగ వీక్షణ చేసేలా 6 నుంచి 7 నిమిషాల జాయ్ రైడ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.4,800 ఛార్జ్ వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అలాగే హనుమకొండ (HNK) నుంచి మేడారానికి రానుపోను హెలికాప్టర్ ప్రయాణానికి రూ.35,999గా ధర నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ హెలికాప్టర్ సేవలు ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేడారం మహాజాతరను సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శించుకోవచ్చని పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793