-->

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్కు’ రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్కు’ రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు


హైదరాబాద్: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అర్ధరాత్రి వేళ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. నగరమంతా న్యూ ఇయర్ జోష్‌తో అంబరాన్ని తాకిన వేడుకలు నిర్వహించగా, యువత ఆడిపాడుతూ సందడి చేసింది. అయితే ఈ ఉత్సాహం కొందరిలో హద్దులు దాటడంతో పోలీసులకు కఠిన చర్యలు తప్పలేదు.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అర్ధరాత్రి వేళ అనవసరంగా రోడ్లపై తిరగవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అయినప్పటికీ పలువురు మందుబాబులు ఈ ఆంక్షలను బేఖాతర్ చేయడంతో నగరవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో న్యూ ఇయర్ సందర్భంగా భారీ ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఒక్క రాత్రికే 1,198 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సడలింపులు ఉండవని పోలీసులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793