-->

సిద్దిపేట జిల్లాలో హెల్త్ చెకప్ పేరిట ఇంటి నుంచి బయలుదేరిన యువతి హత్య

సిద్దిపేట జిల్లాలో హెల్త్ చెకప్ పేరిట ఇంటి నుంచి బయలుదేరిన యువతి హత్య

నాచారం గ్రామ శివారులో మృతదేహం గుర్తింపు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని నాచారం గ్రామంలో యువతి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అనారోగ్య కారణాలతో హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన యువతి, అనంతరం హత్యకు గురై మృతదేహంగా లభించడం కలచివేసింది.

గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు నర్సింహులు కుమార్తె మంతూర్ కల్పన (26)కు ఆరేళ్ల క్రితం కన్యారం గ్రామానికి చెందిన గణేష్‌తో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా భర్తతో విభేదాలు తలెత్తడంతో ఆమె తల్లిదండ్రుల వద్ద ఇస్లాంపూర్‌లో నివసిస్తోంది.

ఈ క్రమంలో డిసెంబర్ 30 సాయంత్రం హెల్త్ చెకప్ నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన కల్పన, డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడకు వైర్ బిగించి హత్య చేసి, మృతదేహాన్ని నాచారం గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇది హత్యేనని నిర్ధారించి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనతో ఇరు గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793