హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు సెషన్స్ న్యాయమూర్తి పాటిల్ వసంత్ తీర్పు
కొత్తగూడెం లీగల్: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కొత్తగూడెం ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు వెలువరించారు.
అయితే మూడవ అన్న మహమ్మద్ ఇబ్రహీం తనకు సగం డబ్బులు రావాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడని, డబ్బులు ఇవ్వలేదనే కక్షతో తమను చంపేస్తానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుమారు వారం రోజుల ముందు కూడా ఇబ్రహీం తమ ఇంటికి వచ్చి బెదిరించినట్లు తెలిపారు.
ఫిర్యాదుదారుడి భార్య హబీబిబీ ప్రతి రోజు ఉదయం నీటి పంపు వద్దకు వెళ్లి నీళ్లు తీసుకువచ్చే అలవాటు ఉండేది. 2020 ఆగస్టు 8న ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో నీటి కోసం వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన మహమ్మద్ ఇబ్రహీం పొడవైన కత్తితో ఆమె మెడపై దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు ఆరోపించారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, వైద్యులు అక్కడికక్కడే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.ఏ. షుకూర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సీఐ ఆర్. భాను ప్రకాష్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు మొత్తం 15 మంది సాక్షులను పరిశీలించింది.
విచారణ అనంతరం నిందితుడు మహమ్మద్ ఇబ్రహీంపై హత్య నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పి.వి.డి. లక్ష్మి వాదనలు వినిపించారు. ప్రస్తుత మణుగూరు ఎస్‌హెచ్‌వో పి. నాగబాబు, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ ఎం. అశోక్ తదితరులు సహకరించారు.

Post a Comment