-->

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 15 మంది మావోయిస్టులు మృతి

కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ హతం


ఝార్ఖండ్ | జనవరి 22: ఝార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్బూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు–మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన కాల్పుల్లో ఇప్పటివరకు 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతాదళాలు వెల్లడించాయి.

మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాంఝీపై రూ.5 కోట్ల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఉదయం మొదలైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతాదళాలు భావిస్తున్నాయి.

ఎన్‌కౌంటర్ ప్రాంతంలో తీవ్ర కాల్పులు జరుగుతుండటంతో ఇప్పటివరకు ఎంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అడవుల్లో దాక్కుని కాల్పులు జరుపుతూ మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం చేయగా, భద్రతాదళాలు వారిని ముమ్మరంగా తరుముతున్నాయి.

అటవీ ప్రాంతంలో ముందుకు సాగుతున్న భద్రతాదళాలకు అక్కడక్కడ బుల్లెట్ గాయాలతో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలు కనిపించడంతో ఇప్పటివరకు 15 మంది చనిపోయినట్లు అంచనా వేశారు. ఈ ఆపరేషన్‌పై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793