-->

కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రం దుర్గం చెరువులో దూకి వ్యక్తి మృతి

కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రం దుర్గం చెరువులో దూకి వ్యక్తి మృతి


శేరిలింగంపల్లి: మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. తరచూ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకి ఆత్మహత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి కేబుల్ బ్రిడ్జి పై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెరువు సమీపంలో స్కూటీని పార్క్ చేసి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు హైడ్రా బృందాల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి వద్ద సెల్‌ఫోన్, స్కూటీ తాళాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793