-->

నటుడు విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు ‘విజిల్’ కేటాయింపు

నటుడు విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు ‘విజిల్’ కేటాయింపు


జనవరి 22: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ‘విజిల్’ ఎన్నికల గుర్తును కేటాయించింది.

ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసిన తమిళ స్టార్ హీరో విజయ్, తన సొంత పార్టీతో ఎన్నికల బరిలో నిలవడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తు కేటాయించాలంటూ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం, తాజాగా TVK పార్టీకి విజిల్ గుర్తును అధికారికంగా కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉండగా, ఎలాంటి రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోబోమని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడులో ఎన్నికలు డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళర్ కట్చి, మరియు తమిళగ వెట్రి కళగం (TVK) మధ్య చతుర్ముఖ పోటీగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793