ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి దుర్మరణం
నల్లగొండ, జనవరి 9: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ట్యాంకర్ మరియు డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు వాహనాలు అధిక వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో ఢీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment