-->

గోదావరిఖనిలో IYM (ఇడియల్ యూత్ మూవ్‌మెంట్) ఏర్పాటు

యువతకు దిశానిర్దేశమే లక్ష్యం : సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్


గోదావరిఖని, జనవరి 09 : యువతలో పెరుగుతున్న సైద్ధాంతిక గందరగోళం, నైతిక సవాళ్లు, స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇడియల్ యూత్ మూవ్‌మెంట్ (IYM – ఆదర్శ యువజన ఉద్యమం) ను గోదావరిఖనిలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జమాత్–ఇ–ఇస్లామీ హింద్, గోదావరిఖని యూనిట్ కార్యాలయంలో 18 నుండి 40 సంవత్సరాల యువకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి రాష్ట్ర మిల్లీ ఉమూర్ కార్యదర్శి జనాబ్ సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ఆయన, IYM ఆవశ్యకత, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, IYM లక్ష్యాలు – వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక నాయకత్వం, సామాజిక బాధ్యత, నిర్మాణాత్మక పౌర భాగస్వామ్యం అని వివరించారు. భావోద్వేగం లేదా తాత్కాలిక ప్రతిచర్యల ఆధారిత కార్యకలాపాలకంటే, క్రమశిక్షణతో కూడిన, విలువల ఆధారిత, లక్ష్యంతో ముందుకు సాగే యువ వేదిక అవసరం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో IYM గోదావరిఖని అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి:

  • కన్వీనర్ : మహమ్మద్ ఇర్ఫాన్
  • కో-కన్వీనర్ : మజారుద్దీన్
  • కార్యదర్శి : మహమ్మద్ ఇమ్తియాజ్
  • సంయుక్త కార్యదర్శి : మహమ్మద్ షోకాత్ అలీ
  • వైస్ ప్రెసిడెంట్ : ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ

ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, మక్సూద్ అహ్మద్ ఖాన్, అహ్మద్ పాషా, మజారుద్దీన్, ఫాజిల్ అహ్మద్ ఖాన్, ఫసియుద్దీన్, డాక్టర్ ఫాతిర్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

యువతను సానుకూల దిశలో నడిపించే లక్ష్యంతో IYM చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పాల్గొన్నవారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793