-->

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు… 15 మంది యువతుల రక్షణ, 30 మంది అదుపులో


మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు… 15 మంది యువతుల రక్షణ, 30 మంది అదుపులో

హైదరాబాద్: నగరంలో మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచార వ్యవహారాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు వెలికితీశారు. KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని 6వ ఫేజ్‌లో ఉన్న Asana Wellness Spa పై ఫిబ్రవరి 13న రాత్రి అకస్మిక దాడులు నిర్వహించారు.

స్థానికంగా నడుస్తున్న ఈ స్పా సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మసాజ్ పేరుతో యువతులను రప్పించి, వారి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. స్పా సెంటర్ లోపల ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

దాడుల సమయంలో 15 మంది యువతులను రక్షించడంతో పాటు, నిర్వాహకులు మరియు విటులు కలిపి మొత్తం 30 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 18 మంది కస్టమర్లు కూడా అక్కడే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, స్పా సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ నిర్వహించడమే కాకుండా, పలు చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. అక్కడ పనిచేస్తున్న కొంతమంది థెరపిస్టులకు సరైన అనుభవ సర్టిఫికెట్లు లేవని గుర్తించినట్లు చెప్పారు. సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో నడుస్తున్న అన్ని స్పా సెంటర్ల నిర్వాహకులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిబంధనలు పాటిస్తూ కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793