కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న **“కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు–2026”**కు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆలయ ప్రతినిధులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ భేటీలో ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక ఆశీర్వచనలు అందించారు.

Post a Comment