-->

బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం


యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలోని చౌటుప్పల్ మండలం పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని ఎల్లగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బృందావన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రియాక్టర్ పేలినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించగానే భారీగా మంటలు చెలరేగి, పరిశ్రమ అంతటా వ్యాపించాయి. రసాయన పదార్థాలు ఉండటంతో మంటలు మరింత వేగంగా విస్తరించాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ కమ్ముకుని పరిసర ప్రాంతాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించి, పరిశ్రమ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. భద్రతా చర్యలలో భాగంగా సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి వివరాలు వెలువడలేదు. గాయపడిన వారు ఉంటే వారిని సమీప ఆసుపత్రులకు తరలించే చర్యలు చేపట్టినట్లు సమాచారం.

అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం కోసం అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793