-->

కంటైనర్ లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. కంటైనర్ లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి


Telanganaలోని Ranga Reddy district జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. Chevella మండలంలోని Shabad పరిధిలోని హైతాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నాగర్‌గూడ చౌరస్తా వద్ద కంటైనర్ లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులు దాసరి అజయ్ (19), ఉదయ్ కిరణ్ (20)గా గుర్తించారు. గాయపడిన అజమ్ (19)కు కాలు విరిగినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం స్థానికులు వెంటనే స్పందించి అజమ్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అజయ్ రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అతనికి తల్లి లేరు, తండ్రి ఒక్కరే ఉన్నారు. ఉదయ్ కిరణ్ కూడా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అజమ్ చికెన్ షాపులో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి కూడా తల్లిదండ్రులు లేరని గ్రామస్థులు తెలిపారు.

ఈ ఘటనతో హైతాబాద్ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793