-->

కొట్ర గేట్ చౌరస్తాలో ఘోర ప్రమాదం – శివ స్వామి మృతి, మరొకరి పరిస్థితి విషమం

కొట్ర గేట్ చౌరస్తాలో ఘోర ప్రమాదం – శివ స్వామి మృతి, మరొకరి పరిస్థితి విషమం


వెల్దండ మండలం, ఫిబ్రవరి 11: వెల్దండ మండల సమీపంలోని హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై కొట్ర గేట్ చౌరస్తాలో మంగళవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివ స్వాములను తీసుకెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కొట్ర గేట్ పరిధిలో ఆటో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో ఆటో తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదంలో ఒక శివ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

ప్రమాదానికి గురైన వ్యక్తులు వికారాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా అనుమానిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను సవ్యంగా మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793