తెలంగాణ అన్నదాతలకు శుభవార్త.. 22 నుంచి రైతుభరోసా నిధుల విడుదల
హైదరాబాద్: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రైతుభరోసా నిధులను ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka, వ్యవసాయ శాఖ మంత్రి Thummala Nageswara Raoతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు.
మొదటి విడతగా ఈ నెల 22న Siddipet జిల్లా నర్మెట్ట నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి, సుమారు 70 లక్షల మంది రైతులకు ఎకరానికి సంబంధించిన రైతుభరోసా కింద రూ.3,590 కోట్లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అనంతరం మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా రూ.2,650 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మిగిలిన రైతులకు కూడా ఏప్రిల్ నెలాఖరులోగా నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించిన రైతులకు సుమారు రూ.9,000 కోట్ల రైతుభరోసా నిధులు జమ కానున్నాయి.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post a Comment