-->

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి


నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793