-->

కరీంనగర్‌లో విషాదం… ఎస్ఐ భార్య ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం… ఎస్ఐ భార్య ఆత్మహత్య


కరీంనగర్, మార్చి 18: కరీంనగర్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న దివ్య మంగళవారం సాయంత్రం గన్నేరు పప్పును నూరి నీటిలో కలిపి తాగినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో బుధవారం మధ్యాహ్నం దివ్య మృతి చెందింది.

మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తీవ్ర కడుపు నొప్పి భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ, ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793