సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బల్మరణం
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. మృతురాలిని చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన నందినిగా గుర్తించారు.
నందిని హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గురువారం నారపల్లి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment