-->

మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేత – నీటిమట్టం తగ్గుముఖం

మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేత – నీటిమట్టం తగ్గుముఖం


రాజన్న సిరిసిల్ల జిల్లా | మార్చి 28: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక వద్ద ఉన్న మిడ్ మానేర్ రిజర్వాయర్లో నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటిమట్టం 318 మీటర్ల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 309.56 మీటర్ల వద్ద నమోదైంది.

రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.71 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లోలు లేకపోవడం గమనార్హం. అయితే అవుట్‌ఫ్లోలు మాత్రం కొనసాగుతున్నాయి.

రిజర్వాయర్ నుంచి మొత్తం 2310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా

  • రైట్ గేట్ ద్వారా 1500 క్యూసెక్కులు
  • రైట్ మెయిన్ కాలువ ద్వారా 550 క్యూసెక్కులు
  • లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా 5 క్యూసెక్కులు

విడుదల అవుతున్నాయి. అదనంగా, ఆవిరీభవనం ద్వారా 210 క్యూసెక్కులు, ఇతర మార్గాల ద్వారా 45 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.

ఇదిలా ఉండగా, రిజర్వాయర్‌లోని 25 స్పిల్‌వే గేట్లలో ప్రస్తుతం 10 గేట్లను అధికారులు తెరిచి ఉంచారు. 9వ గేట్ నుండి 18వ గేట్ వరకు గేట్లు అర్ధ మీటర్ ఎత్తులో ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793