-->

కొత్తగూడెం ఉర్దూ ఘర్, శాదిఖానా నిర్లక్ష్యం – అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు డిమాండ్

కొత్తగూడెం ఉర్దూ ఘర్, శాదిఖానా నిర్లక్ష్యం – అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు డిమాండ్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న ఉర్దూ ఘర్, శాదిఖానా భవనాలు నిర్లక్ష్యానికి గురై భూత్ బంగ్లలా మారిపోయాయని కాంగ్రెస్ కొత్తగూడెం పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు, ఛైర్మెన్లు మారుతున్నప్పటికీ ఉర్దూ ఘర్, శాదిఖానా అభివృద్ధికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పట్టణానికి బయట ఉన్న ఫంక్షన్ హాల్స్‌లో ప్రజలు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఉర్దూ ఘర్ మరియు శాదిఖానాల్లో అలాంటి కార్యక్రమాలు జరగడం లేదన్నారు.

మైనార్టీ సమాజానికి ఉపయోగపడే ఈ భవనాలు సరైన అభివృద్ధి లేక పాడైపోయాయని ఆయన తెలిపారు. ఉర్దూ ఘర్ వంటి భవనాలు సాధారణంగా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయబడతాయని పేర్కొన్నారు. 

ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని, కానీ మైనార్టీలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉర్దూ ఘర్, శాదిఖానాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని మొహమ్మద్ గౌస్ డిమాండ్ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793