-->

లహుజీ సాళ్వె పుస్తక ఆవిష్కరణ – మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా

లహుజీ సాళ్వె పుస్తక ఆవిష్కరణ – మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా


హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్‌లో రాష్ట్ర పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన కార్యాలయంలో “క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం మహారాష్ట్రకు చెందిన రచయిత చంద్రకాంత్ వాన్ ఖేడ్ రాసిన మరాఠీ గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలువడింది. దీనిని గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ అనువదించగా, తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురించింది.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, క్రాంతిగురు లహుజీ సాళ్వె జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి వేలాది స్వాతంత్ర్య సమరయోధులను తీర్చిదిద్దిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన మహాత్మా జ్యోతిరావు ఫూలేకు గురువుగా, అండగా నిలిచి ఆ కాలంలో విద్యా, సామాజిక ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినట్టు వివరించారు.

లహుజీ సాళ్వె చరిత్ర తెలుగువారికి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ గ్రంథం ద్వారా ఆయన జీవితం, ఆశయాలు తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడెమీ కార్యదర్శి డా. నామోజు బాలచారి, సీనియర్ జర్నలిస్ట్ జంగిటి వెంకటేష్, మంత్రిగారి పి.ఎస్. యు. నాగార్జున, రచయిత గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్, సాహితీవేత్త సోమశిల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793