ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు – కలకలం
హైదరాబాద్: ఏప్రిల్ 17: హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో తీవ్ర కలకలం నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి స్టేషన్ పరిసరాల్లో బాంబు పెట్టినట్లు హెచ్చరించడంతో పోలీసులు, మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఈ స్టేషన్‌లో అకస్మాత్తుగా భయాందోళన వాతావరణం నెలకొంది.
పోలీసు కంట్రోల్ రూమ్‌కు వచ్చిన బెదిరింపు కాల్ అనంతరం బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని డస్ట్‌బిన్లు, పార్కింగ్ ప్రాంతం, టికెట్ కౌంటర్లు తదితర ప్రాంతాల్లో నిశితంగా తనిఖీలు చేపట్టాయి.
భద్రతా చర్యలలో భాగంగా స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను వెంటనే బయటకు తరలించారు. కొంతసేపు మెట్రో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. ప్రతి అనుమానాస్పద వస్తువును పరిశీలిస్తూ పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment