-->

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం


నిర్మల్ జిల్లా: ఏప్రిల్ 05: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. బీఆర్‌ఎస్ మద్దతుతో బీజేపీ ఖానాపూర్ మున్సిపాలిటీపై ఆధిపత్యం సాధించింది.

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అంకం మౌనిక ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయల్ విజయం సాధించారు.

మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793